Header Banner

ఈరోజు నుంచి ఓటీటీలోకి వస్తున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్! తెలుగులోనూ సినిమా అందుబాటులో!

  Thu Jun 05, 2025 17:47        Entertainment

బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో, ప్రముఖ తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘జాట్’. వేసవిలో థియేటర్లలో విడుదలై యాక్షన్ చిత్రాల అభిమానులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. విశేషమేమిటంటే, ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను తమ ఇళ్లలోనే వీక్షించే అవకాశం కలిగింది. ఈ చిత్ర కథ మోటుపల్లి అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో రణతుంగ (రణదీప్‌ హుడా), అతని తమ్ముడు సోములు (వినీత్‌ కుమార్‌సింగ్‌) తమ ఆగడాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. వారి కన్ను దేని మీద పడినా అది తమకే దక్కించుకోవాలనేది వారి నైజం.

 

ఇది కూడా చదవండి: వలసదారులపై అమెరికా ఉక్కుపాదం.. ఒకే రోజు 2,200 మంది అరెస్ట్! వీరికి బేడీలు వేసి..

 

ఇలాంటి పరిస్థితుల్లో, జాట్‌ (సన్నీ డియోల్) ప్రయాణిస్తున్న రైలు అనుకోకుండా అదే ఊరి సమీపంలో ఆగిపోతుంది. రైలు రిపేర్ కావడానికి సమయం పడుతుందని తెలియడంతో, జాట్ టిఫిన్ కోసం సమీపంలోని హోటల్‌కు వెళతాడు. అదే సమయంలో కొందరు రౌడీలు హోటల్‌లో గొడవకు దిగుతారు. ఈ క్రమంలో జాట్ తింటున్న ప్లేట్‌ను కిందపడేయడంతో అతను ఆగ్రహానికి గురై, క్షమాపణ చెప్పాలంటూ వారితో ఘర్షణకు దిగుతాడు. ఈ చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, రణతుంగ వరకు చేరుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జాట్‌కు కొన్ని ఊహించని నిజాలు తెలుస్తాయి. రణతుంగను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయి? జాట్ మరియు రణతుంగల మధ్య ఉన్న గతం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో కథనం సాగుతుంది. యాక్షన్ ప్రియులను మెప్పించిన ఈ చిత్రం ఓటీటీలోనూ ఆకట్టుకుంటుందని చిత్ర బృందం భావిస్తోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!

 

వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SunnyDeol #GopichandMalineni #Jaat #Bollywood #ActionMovie #Netflix #TeluguDubbed #MovieAction #Thriller #RandeepHooda #OTTRelease